అన్నమయ్య: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా, మంగళవారం వీరబల్లి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్లకార్డులతో బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సుస్మిత హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.