ప్రకాశం: జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారీయా తెలిపారు. సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.