TG: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.