GHMC పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వం భూమి కేటాయించింది. ప్రభుత్వం భూకేటాయింపులను సవాల్ చేస్తూ రావు బి చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా ధర్నాసనం తుది తీర్పు ఇచ్చింది.