దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్లోని RGV నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ విచారణకు పోలీసులు పిలవగా.. హాజరుకాలేనని వర్మ చెప్పారు. అయితే తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని.. విచారణకు 2 వారాల సమయం కావాలని పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.