అనంతపురం జిల్లా ఈనెల 30న సోమవారం అనంతపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.