KRNL: చెత్తాచెదారం ఆరుబయట వేసి పరిసరాలను అపరిశుభ్రం చేసే వారికి జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆదోనిలోని కునిమహల్లో పర్యటించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగు కాలువల్లో వేయడం వల్ల నీరు పారక, రోడ్డుపై ప్రవహిస్తుందని తెలిపారు. చెత్తను వేయడానికి డస్ట్బిన్లు ఉపయోగించాలని, సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.