KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ప్రణయ్ కుమార్ రెడ్డి బదిలీపై వెళ్లిపోయారు. ఇటీవల కడప జిల్లాలో ఎస్సైల బదిలీలలో ఈయన రాజుపాలెం మండలానికి వెళ్లారు. పులివెందులలో ఇటీవల జూదాలపై దాడి చేయడంతో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఈ బదిలీ జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.