KRNL: కోసిగి మండలం అగసనూరు గ్రామంలోని తుంగభద్ర నది తీరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన మరియు మూల బృందావన ప్రతిష్టాపన సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం వైసీపీ యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.