E.G: గోకవరం సీఎండీ లేఅవుట్లో శనివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మండల వ్యాప్తంగా మహిళలు భారీగా తరలివచ్చారు. గంగిరెడ్ల విన్యాసాలు,మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ సంబరాల్లో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలి.