NTR: తెల్లచొక్కాల వాళ్లకే విలువ ఇస్తారా.? చినిగిపోయిన చొక్కాల వాళ్లను పట్టించుకోరా.? అంటూ మంత్రి పార్థసారథి ఎస్పీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి వచ్చిన మంత్రి సారథికి మోటార్ సైకిల్ పోయి 5నెలల అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయడంతో మంత్రి సారథి ఎస్పీకి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.