ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఎన్నో రకాలుగా కష్టాలు పెట్టారని, జీతభత్యాలు ఒకటో తేదీ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని నారాయణరెడ్డి తెలిపారు.