VSP: వీఎంఆర్డీఏ కార్యాలయంలో గాజువాక అభివృద్ధిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, సర్వీస్ రోడ్లు, కణితి గెడ్డ ప్రాజెక్ట్, పార్కులు, స్టేడియం అభివృద్ధిపై చర్చించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు, జీవీఎంసీ ఫండ్స్‌తో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.