ATP: గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో హైవే డాబా నిర్వాహకులతో శింగనమల సీఐ కౌలుట్లయ్య, ఎస్సై మహమ్మద్ గౌస్ సమావేశం నిర్వహించారు. డాబాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారిపై ఇష్టానుసారం డివైడర్లు తొలగించకూడదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.