KDP: అయోధ్యలో బాల రాముడి ఆలయాన్ని ఆదివారం జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డా.సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బాల రాముడి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీరాముడిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దొడియం విష్ణువర్ధన్ రెడ్డి, మేకల వీర భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.