కాకినాడ: దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న దీపం-2 పథకంలో జిల్లాలో సుమారు 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సూర్యకళా మందిరంలో దీపం -2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు పాల్గొన్నారు.