PLD: వినుకొండ తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం రేషన్ డీలర్లతో తహశీల్దార్ సురేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల రేషన్ సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదని ప్రజల నుంచి ఏమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.