ELR: జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. అలాగే 31వ తేది రాత్రి సమయంలో నిర్వహించే వేడుకల్లో అశ్లీల నృత్యాలు, చర్యలు, సినిమాలు, అశ్లీల సంజ్ఞలు ఆనుమతించబడవన్నారు.