GNTR: సీఎం చంద్రబాబు తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో గురువారం పర్యటించనున్నారు. సంబంధించిన వివరాలను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. తొలుత సీఆర్డిఏ పరిధిలో నిర్మించిన జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మరో 15 సబ్స్టేషన్లు వర్చువల్గా శంకుస్థాపన చేసి, 5 సబ్స్టేషన్లు కూడా వర్చువల్గా సీఎం ఇక్కడి నుంచే ప్రారంభిస్తామన్నారు.