W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా శనివారం బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు, అధికారులు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్ధాలను శుభ్రం చేశారు.