VZM: నెల్లిమర్ల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత కంది చంద్రశేఖర రావు అన్నారు. డెంకాడ మండలంలోని పినతాడివాడ గ్రామంలో సీసీ రహదారి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.