ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున అమ్మవారి మూల మూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతోపాటు ప్రత్యేక పుష్పాలతో అమ్మవారిని అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు.