ఏలూరులోని కత్తెపు వీధికి చెందిన పుప్పాల పవన్ కుమార్ (40) లారీలు కొని ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కొద్ది రోజుల నుంచి మానసిక వేదనతో ఉన్నాడు. ఈనెల 11న అప్పుల బాధ తాళ లేక పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ పవన్ విజయవాడలో సోమవారం మృతి చెందాడు. వన్ టౌన్ ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.