GNTR: గ్రంథాలయాలకు పునరుజ్జీవం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను ఆదివారం ఎంపీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గురువులతో సమానమైన లైబ్రరీలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు లక్ష్యాలు సాధించాలని సూచించారు.