»3 Elephants Died In A Lorry Collision In Chittoor District Ap
Three elephants: చిత్తూరు జిల్లాలో లారీ ఢీకొని 3 ఏనుగులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో లారీ ట్రక్కు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. జగమర్ల అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏపీలోని చిత్తూరు జిల్లా(Chittoor district) పలమనేరు మండలంలో ఘోర ప్రమాదం(accident) జరిగింది. చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిపై జగమర్ల క్రాస్ వద్ద మూడు ఏనుగులు రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. దీంతో మూడు ఏనుగులు(three elephants) మృత్యువాత చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం డ్రైవర్ అతడు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.