TPT: తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహణలోని 19 రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. రుయా ఆస్పత్రి సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్, కపిలతీర్థం నుంచి లీలామహల్ సర్కిల్, మంగళం రోడ్డు, లక్ష్మీపురం సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే రోడ్లను పరిశీలించారు. రోడ్ల మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.