W.G: తణుకు మండలం మండపాకకి చెందిన చీలి సురేష్ అనూష దంపతుల 15 నెలల కుమార్తెకు గుండె సమస్య ఉందని ఎమ్మెల్యే రాధాకృష్ణ దగ్గరికి వచ్చి సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే హైదరాబాద్ స్టార్ హాస్పటల్ వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ చేయించడం జరిగింది. 10 లక్షల రూపాయలు వైద్యాన్ని ఉచితంగా చేయించిన ఎమ్మెల్యే రాధాకృష్ణకి వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.