ATP: న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంటలోగా ముగించాలని అనంత జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం సూచించారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఒంటిగంట దాటితే ఎలాంటి వేడుకలకు అనుమతించబోమని హెచ్చరించారు. జిల్లా అంతటా సెక్షన్ 30 పోలీస్ చట్టం అమల్లో ఉందన్నారు. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపు నిర్వహించరాదని హెచ్చరించారు.