ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్ 20వ డివిజన్‌కు సంబంధించి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MRPS కొత్త కార్యవర్గాన్ని శనివారం ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణం MRPS అధ్యక్షులు ప్రభుదాస్ పాల్గొని డివిజన్ ప్రెసిడెంట్‌గా జాన్సన్, వైస్ ప్రెసిడెంట్‌గా అక్కయ్యను నియమించారు. మిగిలిన కార్యవర్గ సభ్యులు వారి ఎన్నికకు మద్దతు తెలిపారు.