SKLM: ఆమదాలవలస పురపాలక సంఘము కార్యాలయం వద్ద క్రొత్తగా శానిటేషన్ కొరకు కొనుగోలు చేసిన కాంపాక్టర్ వెహికల్‌ను, కాంపాక్టర్ బిన్స్‌ను స్థానిక ఎంఎల్ఏ కూన రవికుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, తద్వారా మంచి ఆరోగ్యంతో పాటు నగరం కూడా సుందరీకరణంగా ఉంటుందని అన్నారు.