విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని సీఎం నారా చంద్రబాబునాయుడుతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గంలో పలు రైల్వే సమస్యలపై ఆయనతో చర్చించారు. డీపీఆర్ తయారీకి అనుమతులు తక్షణమే ఇవ్వాలని మరోసారి రైల్వే మంత్రిని ఎంపీ కోరారు.