ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో కాశి నాయన 30వ ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవం సందర్భంగా నిర్వాహకులు రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించి, విజేతలకు రూ. 60వేల నగదును దాతలు అందజేశారు. పశు ప్రదర్శనను పరిసర ప్రాంత రైతులు ఆసక్తిగా తిలకించారు.