PLD: బోల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామంలో గురువారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పశు వైద్య అధికారి శివుడు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పశు వైద్య అధికారి డాక్టర్ సాల్మన్ సింగ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని పశువుల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.