VZM: భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి ఎమ్మార్వో ఎం.శ్రీను అన్నారు. కలవరాయిలో ఆదివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలు తెలుసుకుని పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.