అన్నమయ్య: పారిశుద్ధ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ బోరెడ్డిగారిపల్లెలో చెత్త సేకరణ నూతన ఆటోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.