ELR: సమగ్ర కుటుంబ సర్వే మండలంలో చురుగ్గా జరుగుతుందని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. గురువారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ.. మండలంలో 27 గ్రామాల్లో సర్వే టీం ఇంటింటికి వెళ్లి అన్ని వివరాలు సేకరిస్తున్నారన్నారు. సేకరించిన వివరాలను యాప్ లో డౌన్లోడ్ చేస్తున్నారన్నారు. పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించానన్నారు.