ATP: అనంతపురంలో పెను ప్రమాదం తప్పింది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో ఆర్డర్ ఇచ్చి కిందకు దిగుతుండగా రైలు కదలడంతో స్విగ్గీ డెలివరీ బాయ్ పట్టుతప్పి కింద పడిపోయాడు. 2 నిమిషాల హాల్ట్ కారణంగా డెలివరీ ఆలస్యమై ఈ ఘటన జరిగింది. ప్రాణాపాయం నుంచి అతను తృటిలో తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.