ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవేన్స్ కార్యక్రమానికి 81 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఏఅర్ దామోదర్ తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు వాటిని పరిష్కరించాలని సంబంధిత మండలాల పోలీసు సిబ్బందికి పంపించారు. గడువులోపు బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.