VSP: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నియోజకవర్గం పరిధిలో 59వ వార్డు ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ అంబేద్కర్ గ్రౌండ్లో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పింఛన్లు పెంచామన్నారు.