NDL: నంద్యాల ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 84 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ అధిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువు లోపు సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసలు చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అదనపు ఎస్పీ యుగంధర్ బాబు పాల్గొన్నారు.