NLR: రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామమని మంత్రి నారాయణ అన్నారు. ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకూ అమరావతి మీదుగా 57 కిలోమీటర్ల మేర లైన్ రూ.2,245 కోట్లతో నిర్మాణం కానుందన్నారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పడేసిందని మండిపడ్డారు.