అనంతపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం నుంచి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.