ATP: రేపు నంబూలపూలకుంట మండలంలో మంగళవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యటిస్తున్నారని వారి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. పి.కొత్తపల్లి గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.