SKLM: రణస్థలం ఎలివేటర్ కారిడార్ అభివృద్ధికి ఆమోదం లభించిందని ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.252.42 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘట్కారీకి రణస్థలం ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.