VSP: కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చి దిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ.. నగరంలో కాలుష్యం పెరుగుతున్నదృష్ట్యా ప్రజా రవాణాలను ఉపయోగించాలన్నారు.