కృష్ణా: నమ్మకంతో నన్ను గెలిపించిన గుడివాడ నియోజకవర్గ ప్రజల ప్రతి సమస్య తీర్చే బాధ్యత తనదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ మండలం లింగవరం గ్రామంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాము మాట్లాడుతూ. తాను ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి తప్ప, అధికారం అనుభవించడానికి కాదని స్పష్టం చేశారు.