కృష్ణా: ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. రూ.6,072 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపారని సీపీఐ మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో ఉన్న వినతిపత్రాన్ని సచివాలయం సెక్రెటరీ రాజుకి అందజేశారు.