కృష్ణా: నూజివీడు మండలం పాత రావిచర్ల గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 9 ద్విచక్ర వాహనాలు, 84,560 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.