VZM: కొత్తవలస మండలం కేంద్రంలో గల పీహెచ్సీ 35 వేల మంది జనాభాకు వైద్యం అందించాల్సి ఉండగా గత కొంత కాలంగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. పాతదాని స్థానంలో10 పడకలతో కొత్తది నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో అది ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ కేంద్రంగా మారింది. పీహెచ్సీని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.