GNTR: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్ పరిసరాలను శుభ్రం చేశారు. పోలీస్ స్టేషన్, కోర్టు, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలను తొలగించి, కాల్వల్లోని వ్యర్థాలను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమిషనర్ అలిమ్ భాషా స్వచ్ఛతహీ సేవా కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు.